Shaakuntalam review - Cinemytalkies

శాకుంతలం,గుణశేఖర్ దర్శకునిగా సమంత ప్రధాన నటిగా చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో దేవ్ మోహన్ ,సచిన్ కేట్కర్, మోహన్ బాబు ,అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ వ్యవహరించారు . ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ మరియు ట్రైలర్ చాలా వరకు ప్రేక్షకులను మెప్పించాయని చెప్పాలి.ఈ సినిమాని మొదట 2D లో తీసిన తర్వాత 3D గా  మార్చారు. మరి ఈ సినిమా ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ -

ఈ సినిమా కాళిదాసు యొక్క అభిజ్ఞాన శకుంతలం నుంచి తీసుకోబడింది.ఇది శకుంతల మరియు దుష్యంతుని యొక్క ప్రేమ కథ. ఇంద్రుడి ప్లాన్లో భాగంగా విశ్వామిత్రుని తపస్సు భాగం కలిగించడానికి మేనక దివి నుంచి భువికి వచ్చి విశ్వామిత్రునితో బిడ్డని కంటుంది. ఆ బిడ్డ పేరే శకుంతల. ఈ శకుంతల కన్వ మహర్షి ఆశ్రమానికి ఎలా చేరుతుంది?దుష్యంతుడు శకుంతలను ప్రేమించి ఎలా గంధర్వ వివాహం చేసుకుంటాడు దాని తర్వాత వచ్చే డ్రామా ట్విస్టులతో సినిమా నడుస్తుంది.

 

నటీనటుల పెర్ఫార్మన్స్ - 

ఈ సినిమాలో సమంత పాజిటివ్ గాను మరియు నెగిటివ్ గాను ఉంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ మరియు ఆమె అందం సినిమాకి పెద్ద పాజిటివ్ అయినా  ఈ సినిమాలో ఆమె తన సొంత డబ్బింగ్ చెప్పడం వల్ల అదే ఈ సినిమాకి పెద్ద నెగిటివ్ అయ్యింది. శకుంతల అనేది ఒక పౌరాణిక పాత్ర అలాంటి పాత్రలో సమంత వచ్చిరాని తెలుగులో పౌరాణిక డైలాగులు చెప్పడం కుదరలేదు అదే ఈ సినిమాకు ఒక మైనస్ గా నిలిచింది. 

దుష్యంతునిగా దేవ్ మోహన్ బాగా నటించారు. కొన్ని చిన్న చిన్న సీన్స్ లో తప్ప మిగిలిన అన్నిట్లో ఆడియన్స్ ని మెప్పించారనే చెప్పాలి. దేవ్ మోహన్ కి దుష్యంతునిగా ఇంకొన్ని సీన్స్ రాసి ఉంటే బాగుండేది. ఈ పాత్రకు దేవ్ మోహన్ కన్నా ప్రేక్షకులకు బాగా తెలిసిన మొహాన్ని చూపించుంటే ఆ పాత్రకి ఇంకా బలంగా ఉండేది 

ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్హా నిలుస్తుంది. తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో మరియు డైలాగ్స్ తో ప్రేక్షకుల మనసులను క్లైమాక్స్లో దోచుకుందనే చెప్పాలి. 

మిగిలిన నటులు మోహన్ బాబు సచిన్ కేడ్కర్ అనన్య నగర్ లో ప్రకాష్ రాజు మరియు తదితరులు వాళ్లకి ఇచ్చిన పాత్రలో బాగానే నటించారు. 

టెక్నికాలిటీస్ -

దర్శకుడు గుణశేఖర్ ఆలోచన మంచిదైనా దాన్ని స్క్రీన్ మీదకు తీసుకురావడంలో అంత సక్సెస్ కాలేదు. ఎమోషనల్ సీన్స్ అసలు ఏమాత్రం మెప్పించలేదు. 3D వర్క్ కూడా అలాగే ఉంది. సినిమాలో సమంత డైలాగ్స్ బాగానే ఉన్నా ఆమె సొంత డబ్బింగ్ చెప్పడంతో అవి కూడా అంతగా ఏమి అనిపించలేదు. ఇది ప్రేమ కథ కావడం వల్ల దుష్యంతునికి శకుంతలకి కెమిస్ట్రీ ఉంటే బాగుండేది కానీ ఇది ఎక్కడ లేదు. సెకండ్ హాఫ్ లో శకుంతల ఒక బాధని ఇంకా బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. మణిశర్మ మ్యూజిక్ నీట్ గా ఉంది, ఇంకొంచెం బెటర్ గా చేస్తే బాగుండేది అనిపించింది. వార్ సీన్స్ ఫస్ట్ అఫ్ లో బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ లో అంతగా ఏమనిపించలేదు . 

వెర్డిక్ట్ -

చివరిగా ఒక పౌరాణిక ప్రేమ కథని కమర్షలైజ్ చేసి చూపించాలనుకోవడం మంచి ప్రయత్నం అయినా దాన్ని ఆడియన్స్ ముందుకు కరెక్ట్ గా తీసుకురావడంలో విఫలమయ్యారు. ఇది కచ్చితంగా పనులు మానేసుకొని చూడాల్సిన సినిమా అయితే కాదు. అలా అని చూడకూడని సినిమా అయితే కాదు. కానీ ఇది అందరికీ తెలియాల్సిన కథ. 

Rating - 2/5

Post a Comment

Previous Post Next Post