పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లీక్స్ వెంటాడుతున్నాయి. మొన్నటిదాకా సలార్ సినిమా నుంచి లీక్స్ వస్తే ఇప్పుడు తాజాగా ఇంకొక సినిమా నుంచి ప్రభాస్ లుక్స్ లీక్ అయ్యాయి. ఈ సినిమాని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు .రాజా డీలక్స్ టైటిల్ ఫైనల్ చేసినట్టు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. లీకైన ఫోటోలలో ప్రభాస్ చాలా కాలం తర్వాత ఒక కలర్ఫుల్ చెక్స్ షర్ట్ తో రగడ లుక్ తో కనిపిస్తున్నాయి. ఆ ఫోటో చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్లో ట్వీట్స్ చేస్తూ ట్రెండ్స్ చేస్తున్నారు .
కానీ ఇలాంటిది ఇంతకుముందు జరిగింది. రాధేశ్యాం టైంలో కూడా లుక్స్ బాగున్నాయంటూ సినిమానే ఒక రేంజిలో లేపారు కానీ సినిమా రిజల్ట్ చూస్తే డిజాస్టర్ గా మిగిలిపోయింది . అది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒక చేదు జ్ఞాపకం. లుక్స్ బాగుంటే సరిపోదు కంటెంట్ కూడా కావాలి అని చెప్పి ఆ సినిమా ప్రూవ్ చేసింది. మరి ఈ సినిమాలో కూడా లుక్స్ బాగున్నాయి కంటెంట్ కూడా బాగుంటే అంతకంటే ఫ్యాన్స్ కు ఏం కావాలి. ఈ సినిమా ఫ్యాన్స్ కోసం చేస్తున్న అని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పనే చెప్పాడు
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ సలార్ ఆఖరి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది . ఆమెతోపాటు ముఖ్య పాత్రలలో జగపతిబాబు, పృథ్వీరాజ్, ఈశ్వరీరావు ,శ్రీయ రెడ్డి కనబడబోతున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 కి విడుదల కానున్నది.